Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..

Sharwanand

Sharwanand

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేసారు శర్వా. కానీ అనుకున్నంత రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే సినిమా చేస్తున్నాడు శర్వా. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరోసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల భారీ బడ్జెట్‌తో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘నాగబంధం’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా తమ తదుపరి చిత్రాన్ని శర్వానంద్‌తో ప్లాన్ చేస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ‘నాగబంధం’ చిత్రానికి భారీగా ఖర్చు చేసిన మేకర్స్, ఈ సారి కూడా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నారట. శర్వానంద్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది. భారతీయ పురాణేతిహాసమైన మహాభారతం లోని ఓ ఘట్టం ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పురాణ గాథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ స్క్రిప్ట్‌ను రూపొందించారు. అంతేకాకుండా ఇది ఒక భారీ మల్టీస్టారర్ కావడం విశేషం. శర్వానంద్‌తో పాటు మరో క్రేజీ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.