ఇటీవల ‘నారి నారి నడుమ మురారి’ అనే సినిమాతో క్లీన్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. అయితే, ఈ సినిమా కథ విన్న తర్వాత రామ్ అబ్బరాజు తనకు దేవుడిలా అనిపించాడని చెప్పుకొచ్చాడు. “ఈ మధ్యకాలంలో క్లీన్ కామెడీ రాసుకోవడమే కాదు, స్క్రీన్ మీద అంతే చక్కగా పండించడం కూడా కష్టమైపోతుంది కదా?” అని ప్రశ్నించగా, దానికి ఈ మేరకు సమాధానం ఇచ్చాడు శర్వానంద్. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ ‘నారి నారి నడుమ మురారి’ రూపొందింది. భాను, నందు రచయితలుగా వ్యవహరించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది.
Also Read:Vijay Deverakonda-VD14: విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. ‘ది రైజ్ బిగిన్స్’!
అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో సాక్షి వైద్యతో పాటు సంయుక్త మీనన్ మరో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆలస్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాకి ఆశించిన మేర థియేటర్లు అయితే దొరకలేదు. ఈ క్రమంలోనే కలెక్షన్స్ కూడా పెద్దగా నమోదు కావడం లేదు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన మరికొన్ని సినిమాల స్థానంలో, ఈ సినిమాకి థియేటర్లు రాబోతున్న వారంలో కేటాయించే నేపథ్యంలో సినిమాకి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని సినిమా థియేటర్లను కేటాయిస్తున్న క్రమం ఆసక్తి కలిగిస్తోంది.