హీరోగా శర్వానంద్ సాలిడ్ హిట్స్ అందుకుని చాలా కాలమైంది. నిజానికి ఆయన చివరిగా నటించిన ‘మనమే’ అయితే డిజాస్టర్ అయింది. అయితే దానికన్నా ముందు నటించిన ‘ఒకే ఒక జీవితం’ తమిళ, తెలుగు బైలింగ్వల్‌గా రూపొందింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోయినా, క్రిటిక్స్ నుంచి మాత్రం మంచి అప్లాస్ దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఆయన చివరి కమర్షియల్ హిట్ ‘జాను’ అనే చెప్పొచ్చు. అయితే ఆ సినిమాని కూడా చాలామంది హిట్గా పరిగణించలేరు.
Also Read :Nari Nari Naduma Murari Review: నారీ నారీ నడుమ మురారి రివ్యూ.. శర్వా హిట్ కొట్టినట్టేనా?
అయితే ఎట్టకేలకు ఆయన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’ మాత్రం హిట్ టాక్ సంపాదించింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. సంక్రాంతి అడ్వాంటేజ్ కలిసి రావడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాని 14వ తేదీ ప్రీమియర్స్‌తో రిలీజ్ చేశారు. 15వ తేదీ సంక్రాంతి కావడం, తర్వాత లాంగ్ వీకెండ్ దొరకడంతో శర్వానంద్ కెరీర్‌లోని మంచి కలెక్షన్స్ రాబట్టే సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద శర్వానంద్ ఎట్టకేలకు హిట్టు కొట్టేసాడు అనే మాట వినిపిస్తుండటంతో, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
