Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ హిట్ కోసం చూస్తున్న హీరో శర్వానంద్ ప్రెసెంట్ సక్సెస్‌కు దూరమైన ఇద్దరు డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఒకవైపు ‘భోగి’తో సంపత్ నంది, మరోవైపు ‘జార్జ్ క్రిష్’తో శ్రీను వైట్ల. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు శర్వాకు మాస్ హిట్ ఇస్తారా లేదా శర్వా సక్సెస్ ట్రాక్‌కు బ్రేకులు వేస్తారా? శర్వానంద్ కెరీర్లో ఇప్పుడు కొత్త ఫేజ్ మొదలైనట్టే కనిపిస్తుంది. నారి నారి నడుము మురారి, బైకర్ అంటూ వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలకు శర్వా ఇప్పుడు మాస్, ఫ్యామిలీ జానర్లలో రెండు క్రేజీ ప్రాజెక్టులతో వస్తున్నాడు. అయితే ఇక్కడ అసలు టెన్షన్ హీరోలే కాదు, అతనితో జతకట్టిన డైరెక్టర్లు కూడా!
మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన సంపత్ నందికి ‘భోగి’ చాలా కీలకమైన ప్రాజెక్ట్. లేటెస్ట్గా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే ఇప్పుడు శర్వానంద్‌ను పూర్తిగా మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు. 1960స్ పీరియడ్ బ్యాక్‌డ్రాప్, ఊరమాస్ యాక్షన్, రక్తపాతం, కమ్మరోళ్ల గంగ పాత్ర ఇలా ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ‘భోగి’, సంపత్ నంది కెరీర్‌కు మరొక బిగ్ టర్నింగ్ పాయింట్ ఇస్తుందా అన్నది చూడాలి. శ్రీను వైట్ల – శర్వానంద్ కాంబినేషన్లో ‘జార్జ్ క్రిష్’ వస్తోంది. ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్స్తో తనదైన మార్కు చూపించిన శ్రీను వైట్ల ఈ మధ్య సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్నాడు. కెరీర్లో కొంత గ్యాప్ తర్వాత వస్తున్న ‘జార్జ్ క్రిష్’ శ్రీను వైట్లకు కేవలం మరొక సినిమా కాదు, ఒక కమ్‌బ్యాక్. శర్వా ఇమేజ్‌కు తన కామెడీ మార్కును యాడ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ పాత వైట్లను చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
Also Read
శర్వానంద్ ఇప్పటికే సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు. కానీ అతనితో జతకట్టిన ఇద్దరు దర్శకులకు మాత్రం ఈ విజయమే అత్యంత కీలకం. ‘భోగి’తో సంపత్ నంది, ‘జార్జ్ క్రిష్’తో శ్రీను వైట్ల ఇద్దరూ తమ కెరీర్లో బౌన్స్ బ్యాక్ కోసం చూస్తున్నారు. నవంబర్ 12న ‘భోగి’ రిజల్ట్, వచ్చే సంక్రాంతికి ‘జార్జ్ క్రిష్’ రిజల్ట్.. ఈ రెండు సినిమాలు భవిష్యత్తుతో పాటు ఈ ఇద్దరు దర్శకుల కమ్బ్యాక్ని కూడా డిసైడ్ చేయనున్నాయి.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!