Site icon NTV Telugu

Pathaan: ఈ వీకెండ్ కూడా పఠాన్ దే…

Pathaan

Pathaan

అయిదేళ్ల తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్, తనని బాలీవుడ్ బాద్షా అని ఎందుకు అంటారో అందరికీ అర్ధం అయ్యేలా చేస్తున్నాడు. జనవరి 25న పఠాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్… మూడు వారాలుగా రాక్ సాలిడ్ ఆకుపెన్సీని మైంటైన్ చేస్తూనే ఉన్నాడు. డే 1 నుంచి డే 25 వరకూ పఠాన్ సినిమా బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తూ వచ్చింది. థర్డ్ వీక్ లో కూడా పఠాన్ సినిమా స్లో అవ్వలేదు. నాలుగో వారంలో కొత్త సినిమాల రిలీజ్ ఉండడంతో పఠాన్ సినిమా కలెక్షన్స్ లో ఎక్కువ డ్రాప్ కనిపిస్తుందని అందరూ ప్రిడిక్ట్ చేశారు కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యి పఠాన్ మళ్లీ స్ట్రాంగ్ గా నిలబడింది. పఠాన్ సినిమా టికెట్ ని ఇండియా మొత్తం 110/- రూపాయలకే ఇస్తున్నాం, పఠాన్ డే ని ఎంజాయ్ చెయ్యండి అంటూ మేకర్స్ ప్రచారం చెయ్యడంతో, పఠాన్ కలెక్షన్స్ మరోసారి జోష్ అందుకున్నాయి. నిన్న పఠాన్ సినిమాని చూడడానికి నార్త్ ఆడియన్స్ మళ్లీ థియేటర్స్ కి వచ్చారు. దీంతో పఠాన్ సినిమా నార్త్ కలెక్షన్స్ 505 కోట్లకి చేరింది.

బాహుబలి 2 హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చెయ్యడానికి పఠాన్ కేవలం 6 కోట్ల దూరంలో ఉంది. ఓవరాల్ గా పఠాన్ సినిమా 976 కోట్లు రాబట్టింది. టికెట్ రేట్ తగ్గించిన ప్లాన్ వర్కౌట్ అవ్వడం, కార్తీక్ ఆర్యన్ నటించిన షెహజాదా సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో యష్ రాజ్ ఫిల్మ్స్ మరోసారి కొత్త ప్లాన్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఈరోజు, రేపు పఠాన్ సినిమా టికెట్ ని నేషనల్ చైన్స్ లో 200/- ఇవ్వనున్నారు. ఏ థియేటర్ లో అయినా 200/- కే పఠాన్ సినిమా చూసెయ్యండి అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తో పఠాన్ సినిమా వీకెండ్ కలెక్షన్స్ లో సాలిడ్ గ్రోత్ కనిపించడం గ్యారెంటీ. మరి ఏడేళ్ళుగా చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి 2 హిందీ రికార్డ్స్ ని షారుఖ్ ఖాన్ ఈ సండే నైట్ షోతో బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Exit mobile version