Site icon NTV Telugu

Pathaan: కేవలం ఓవర్సీస్ లోనే 320 కోట్లు… ఇది కదా ర్యాంపేజ్ అంటే…

Pathaan

Pathaan

ఒక పాన్ ఇండియన్ సినిమా ఇండియాలో 300 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే గొప్ప విషయం. కార్తికేయ 2, పుష్ప, కాంతార సినిమాలు ఇండియాలో అయిదు 300 నుంచి 500 కోట్లు రాబట్టినవే. అయితే ఇవి ఆ సినిమాలు అన్ని భాషల్లో కలిపి రాబట్టిన కలెక్షన్స్. కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఒక్క భాషతోనే(హిందీ) ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. బాక్సాఫీస్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ ఇండియాలో ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. బాలీవుడ్ లో అన్ని రికార్డులని బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టిస్తున్న పఠాన్ సినిమా ఇప్పటివరకూ 832 కోట్లని రాబట్టింది. టైగర్ జిందా హై నుంచి దంగల్ వరకూ బాలీవుడ్ ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తున్న పఠాన్ ఓవర్సీస్ లో హావోక్ క్రియేట్ చేస్తున్నాడు. కేవలం ఓవర్సీస్ లో పఠాన్ సినిమా 320 కోట్లు కలెక్ట్ చేసి, హిందీ సినిమాలకి ఓవర్సీస్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డులు కూడా పఠాన్ ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. అయిదేళ్ల తర్వాత తన సినిమాని రిలీజ్ చేసిన షారుఖ్ ఖాన్, తాను ఓవర్సీస్ బాద్షా అని మరోసారి గ్రాండ్ లెవల్లో ప్రూవ్ చేశాడు. ఈ దెబ్బతో షారుఖ్ ఖాన్ మళ్లీ టాప్ లీగ్ లోకి వచ్చేసాడు. సెకండ్ వీక్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్న పఠాన్ సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తుంది. ఓవర్సీస్ లో ప్రస్తుతం బాహుబలి 2కి కాస్త దూరంలోనే ఉన్న పఠాన్ సినిమా నార్త్ ఇండియాలో మాత్రం ఫుల్ రన్ లో బాహుబలి రికార్డులని బ్రేక్ చేసే లాగే ఉంది. 2017లో వచ్చిన బాహుబలి 2 సినిమా అక్కడ కేవలం హిందీ భాషలోనే 500 కోట్లకు పైగా రాబట్టింది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ని పఠాన్ సినిమా ఇలానే మైంటైన్ చేస్తే బాహుబలి 2 రికార్డులు బ్రేక్ అవ్వడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. రెండో వారంలోని శనివారం, ఆదివారం రోజుల్లో పఠాన్ సినిమా 48 కోట్లు రాబట్టింది అంటే షారుఖ్ ఖాన్ ఆడియన్స్ ని థియేటర్స్ కి ఏ రేంజులో పుల్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version