NTV Telugu Site icon

Salaar Vs Dunki : ప్రభాస్ ఫ్యాన్స్ పై షారుఖ్ ఫ్యాన్స్ దాడి?

Salaar Vs Dunki

Salaar Vs Dunki

Sharukh Khan fans attacks Prabhas Fans at Public Review point IMAX:ప్రభాస్ సలార్ సినిమా, షారుఖ్ డంకీ సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అని ట్రేడ్ వర్గాల వారు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే నేషనల్ చైన్స్ పీవీఆర్-ఐనాక్స్, సినీ పోలిస్ లలో సలార్ టికెట్లు అమ్మడం లేదని తెలియడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫాన్స్ మీద షారుఖ్ అభిమానులు దాడి చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వొద్దు.. డీసీపీ వచ్చి బ్రతిమలాడినా వినలేదు!

హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద పబ్లిక్ టాక్ సమయంలో ప్రభాస్ అభిమానులు డంకీ సినిమా బాలేదని అనడంతో వారి మీద దాడికి యత్నించారు షారుఖ్ ఫాన్స్. వెంటనే సెక్యూరిటీ అలెర్ట్ అయి వారిని విడగొట్టారు. గతంలో ఆదిపురుష్ సినిమా సమయంలో ఇలానే దాడి చేయడంతో థియేటర్ బయట రివ్యూలు చెప్పడం మానిపించారు. అయితే కాంపౌండ్ బయట పెట్టినా అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. ఇక డంకీ సినిమా ఒక ఎమోషనల్ డ్రామా, కేవలం హిందీ భాషలోనే రిలీజ్ అవుతుంది. దీంతో డంకీకి సౌత్ లో భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ప్రభాస్ సలార్ సినిమా హిందీతో పాటు సౌత్ లోని నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుండడం బాగా కలిసొచ్చే అంశం.