NTV Telugu Site icon

Sharat Saxena: ఛీ.. ఇదేనా బతుకు.. అసహ్యం వేసేది.. ఆ హీరోలు అలా

Sharath

Sharath

Sharat Saxena: శరత్ సక్సేనా పేరు చాలా తక్కువమందికి తెలుసు.. కానీ ఆయన ఫేస్ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా సింహాద్రి, బన్నీ సినిమాల్లో ఆయన పాజిటివ్ పాత్రల్లో కనిపించినా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇప్పటికీ ఆయన హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విలన్ గా నటిస్తున్నాడు. గత 30 ఏళ్లుగా ఆయన విలన్ గా కనిపించి మెప్పిస్తున్నాడు. ఇక తాజాగా ఒకఇంటర్వ్యూ లో శరత్ తన మనోగతాన్ని విప్పాడు. హీరోల చేతుల్లో తన్నులు తిన్నడమే జీవితంగా మారిపోయిందని, అలా చేసే చేసి తన మీద తనకే అసహ్యం వేసిందని చెప్పుకొచ్చాడు. ఇక సౌత్ లో.. హీరోల ఎంట్రీ సీన్స్ కే పరిమితమని.. వారిని హీరోగా చూపించడానికి.. నాలుగు దెబ్బలు విలన్స్ ను కొట్టి హీరో అని చూపించేవారని చెప్పుకొచ్చాడు.

Fungal Meningitis: ఫంగల్‌ మెనింజైటిస్‌తో వ్యాప్తితో ప్రమాదం.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి..

“ముంబైలో నాకు పని దొరకక.. సౌత్ లో అడుగుపెట్టాను. ఇక్కడకి వచ్చి చూస్తే.. కేవలం ఫైట్ సీన్స్ కు మాత్రమే పిలిచేవారు. రోజూ హీరో చేతిలో తన్నులు తింటూ ఉంటడానికే మేకప్ వేసుకొని రెడీ అయ్యేవాడిని.. అలా ఉదయం నా ముఖం నేనే అద్దంలో చూసుకోలేకపోయేవాడిని.. ఛీ.. ఇదేనా బతుకు.. అసహ్యం వేసేది నా ముఖం నేను చూసుకుంటే.. నేను చేసిన చాలా సినిమాలు అలాగే ఉండేవి. హీరోలు వస్తారు.. నన్ను కొడతారు.. నేను వెళ్ళిపోతాను.. గత 30 ఏళ్లుగా ఇదే చేస్తున్నాను. ఇక ఒకానొక సమయంలో హిందీలో సినిమాలు మానేయాలనుకున్నాను. కానీ, డబ్బు లేకపోతే ఎలా..? ఒకసారి నా భార్యను అడిగాను.. మన దగ్గర డబ్బు ఎంత ఉంది అని, ఒక ఏడాది బతికేయొచ్చు అని చెప్పింది. దీంతో హిందీ సినిమాలు మానేశాను. ఆ తరువాత కమల్ హాసన్ నటించిన గుణ సినిమాలో అవకాశం ఉందని ఆఫర్ వచ్చింది. ఆ సినిమా నాకు గుర్తింపునే కాదు మంచి డబ్బు కూడా అందించింది. ఇక తెలుగులో చిరంజీవి తో కలిసి 15 చిత్రాలు చేశాను.. నాగ్, వెంకటేష్ ఇలా అందరితోనూ కలిసి పనిచేశాను” అని చెప్పుకొచ్చా. ప్రస్తుతం శరత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.