Site icon NTV Telugu

Indian 2: శంకర్ సర్ సినిమాలు చేస్తున్నారా? సీరియల్స్ చేస్తున్నారా? మరీ పోస్ట్ సమ్మర్ కి వాయిదా ఏంటండీ?

Kamal

Kamal

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. శంకర్ గ్రాండ్ సెట్స్ కోసం భారీ ఖర్చుని సరదాగా పెడుతుంటాడు శంకర్. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్దే శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ ఎంత అవుట్ ఫామ్ లో ఉన్నాడు అంటే ఇండియన్ 2 సినిమా సీరియల్ చెక్కినట్లు చిక్కుతూనే ఉన్నాడు. క్లారిటీ లేదో లేక అనివార్య కారణాల ఎఫెక్టో తెలియదు కానీ వాయిదా తర్వాత మొదలైన ఇండియన్ 2 షూటింగ్ ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని 2024 జనవరికి రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. సరేలే ఇండియన్ 2 సంక్రాంతికి వస్తే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సమ్మర్ కి షిఫ్ట్ అవుతుంది, ఎక్కువ సెలవలు దొరుకుతాయి కాబట్టి మన సినిమాకి మంచి జరుగుతుందనుకున్నారు మెగా ఫ్యాన్స్.

ఇప్పుడు ఇండియన్ 2 సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ కి కూడా దాటేసి ఆగస్టు 15కి షిఫ్ట్ అవుతుందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ మాటలో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ఇప్పటికైతే ఇండియన్ 2 ఇండిపెండెన్స్ వీక్ ని టార్గెట్ చేస్తుందని సమాచారం. ఇండియన్ 2 రిలీజ్ అయ్యే వరకూ గేమ్ ఛేంజర్ బయటకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. దిల్ రాజు అంతటి ప్రొడ్యూసర్… మన చేతిలో ఏం లేదు అంతా డైరెక్టర్ చేతిలో ఉంది అనే కామెంట్స్ చేస్తున్నాడు. బాహుబలి, KGF, ఆర్ ఆర్ ఆర్ లా పీరియాడిక్ డ్రామాని అయితే శంకర్ తెరకెక్కించట్లేదు. ఇండియన్ 2 ఫక్తు కమర్షియల్ సినిమా… మరి దీనికి ఎందుకు రెండు మూడేళ్ల సమయం పడుతుందో శంకర్ కే తెలియాలి.

Exit mobile version