‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకుంది జబల్‌పూర్ బ్యూటీ షాలినీ పాండే. ఆమె పోషించిన ప్రీతి పాత్ర అప్పట్లో యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘మహానటి’లో సుశీల పాత్రతో మరోసారి నటనలో తనదైన ముద్ర వేసింది. అయితే మొదటి రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఆ తర్వాత ప్రాజెక్టులు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి.
Also Read : Mammootty: మమ్ముట్టి హెల్త్ అప్‌డేట్..
తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగించినా, షాలినీకి సరైన బ్రేక్ దొరకలేదు. ముఖ్యంగా తమిళంలో ఆమె నటించిన ‘100 శాతం కాదల్’ భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఆమె కెరీర్‌లో స్థిరపడినట్టే అనుకున్న ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే నటనలో ఉన్న ప్రతిభను గమనించిన ధనుష్, తన స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న ‘ఇడ్లీకడై’ అనే సినిమాలో షాలినీకి మరోసారి కీలకమైన అవకాశం ఇచ్చారు. ఇందులో ఆమెకు జోడీగా అరుణ్ విజయ్ నటిస్తుండగా, ధనుష్ స్వయంగా హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా షాలినీ మళ్లీ కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ ‘ఇడ్లీకడై’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 1న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ సర్కిల్స్ కూడా షాలినీ ఈ చిత్రాన్ని గట్టిగా పట్టుకుని కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావాలని ఆశిస్తున్నాయి.