NTV Telugu Site icon

Shakeela: మొన్న విచిత్ర.. నేడు షకీలా.. ఆయన నన్ను రూమ్ కు రమ్మన్నాడు

Shakila

Shakila

Shakeela: శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు.. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు కూడా వచ్చింది. ఇక ఆమె జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే అని తెలుసు.. కానీ, అందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయని.. ఆమె నిత్యం ఏదో ఒక విషయాన్ని బయటపెడుతూనే ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చిన షకీలా హౌస్ లో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. ఇక హోస్ నుంచి బయటకు వచ్చాక షకీలా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. సినిమా అవకాశాల కోసం వెళ్తే ఎంతోమంది తనను కమిట్ మెంట్ అడిగారని ఆమె నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె.. ఒక డైరెక్టర్ తనను రూమ్ కు రమ్మన్నాడని చెప్పుకొచ్చింది.

Sai Pallavi: హీరోల కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్న ఫిదా బ్యూటీ.. ?

ఇక ఈ మధ్య తమిళ్ బిగ్ బాస్ లో నటి విచిత్ర.. ఒక హీరో.. సినిమా సెట్ లో తనను గదికి రమ్మని పిలిచాడని, తాను వెళ్లకపోయేసరికి.. తరువాతి రోజు నుంచి టార్చర్ చూపించాడని చెప్పి ఎమోషనల్ అయ్యింది. ఇక ఇప్పుడు షకీలా కూడా.. అదే విధంగా చెప్పుకురావడం షాక్ కు గురిచేస్తోంది. హీరో అల్లరి నరేష్ తండ్రి, దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తనను అడ్జెస్ట్ మెంట్ అడిగాడని చెప్పుకొచ్చింది. “విచిత్ర నా ఫ్రెండ్. ఆమె చెప్పడం బాగుంది. ఇండస్ట్రీ వదిలి రావడానికి కారణం అయిన ఆ హీరో పేరు కూడా చెప్తే ఇంకా బావుండేది. నేను కూడా ఇలాంటి కమిట్ మెంట్స్ ఎదుర్కొన్నాను. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణతో కలిసి ఒక సినిమా చేశాను. ఆ సినిమా తరువాత మరో సినిమా ఛాన్స్ ఇస్తాను.. రూమ్ కు వస్తావా అని అడిగాడు. నేను వెంటనే.. సర్.. ఈ సినిమాకు నాకు డబ్బులిచ్చేశారు. వేరే సినిమా నాకు అవసరం లేదు అని చెప్పాను. ఈ విషయం నేను ఎప్పుడైనా.. ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఆరోజు.. ఆయన నన్ను రూమ్ కు రమ్మన్నాడు.. ఇది నిజం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments