NTV Telugu Site icon

Shahrukh Khan: నేను కూడా మాస్ హీరో అని చెప్పండి రాజమౌళి.. ప్లీజ్

Sharukh

Sharukh

Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తెలుగువారిని బాగా ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ తోనే సౌత్ ను కూడా మెప్పించిన షారుఖ్ ఇప్పుడు జవాన్ తో మరోసారి అభిమానులను మెప్పించాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో నటించగా .. సంజయ్ దత్, దీపికా పదుకొనే క్యామియోగా కనిపించి మెప్పించారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒక్కరోజులోనేరికార్డు కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా జవాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి ఉదయం సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్ సినిమా చూసి సూపర్ అంటూ రివ్యూ ఇచ్చిన విషయం తెల్సిందే. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా జవాన్ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా రివ్యూ చెప్పుకొచ్చాడు.

Chandramukhi 2: బిగ్ బ్రేకింగ్.. చంద్రముఖి 2 వాయిదా..

” షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ బాద్షా అవ్వడానికి కారణం ఇదే. ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ ను బద్దలుకొట్టాడు. కంగ్రాట్స్ అట్లీ ఉత్తరాదిలో కూడా విజయ పరంపరను కొనసాగించినందుకు, అద్భుతమైన విజయం సాధించిన జవాన్ బృందానికి అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి ట్వీట్ పై షారుఖ్ స్పందించాడు. ” చాలా ధన్యవాదాలు సర్.. సినిమాకోసం మీరు చేసిన సృజనాత్మక ఇన్‌పుట్‌ల నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాం.. దయచేసి మీకు వీలైనప్పుడు సినిమా చూడండి.. ఆ తరువాత నాకు కాల్ చేసి.. నేను కూడా మాస్ హీరోనే అని చెప్పండి.. హాహా.. ప్రేమతో” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.