బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ హిట్ సినిమా జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం షాహిద్ ఎంతగానో కష్టపడ్డాడు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ప్రముఖ ఓటిటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ రాగా నిర్మాతలు ఓటిటీకే ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా చేయడం వలన నిర్మాతలకు నష్టం రాకుండా ఉంటుందని వారు భావిస్తున్నారట.
ఇకపోతే ఈ నిర్ణయాన్ని షాహిద్ వ్యతిరేకిస్తున్నాడట. ఈలాంటి చిత్రం థియేటర్లలోనే రిలీజ్ అవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతల నష్టాన్ని కావాలంటే తన పారితోషికంలో తీసుకోమని, అంతేకాని సినిమాను ఓటిటీలో రిలీజ్ చేయొద్దు అని చెప్తున్నాడట. కబీర్ సింగ్ బాక్సాఫీస్ హిట్‌గా నిలవడంతో షాహిద్ కపూర్ ఈ సినిమాకు కూడా రూ. 31కోట్ల భారీ పారితోషికాన్ని అందుకున్నాడు. అందులో నిర్మాతలు నష్టపరిహారం తీసుకోమని నిర్మాతలను కోరుతున్నాడట. మరి ఈ విషయమై నిర్మాతలు ఏం అంటారో చూడాలి.
