Site icon NTV Telugu

షారుఖ్-అట్లీ చిత్రానికి బాలయ్య టైటిల్ !

Shah Rukh Khan's next with director Atlee film name is Lion

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో కథానాయికలు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు. అక్కడ నుంచి లీకైన ఫోటోలలో షారుఖ్ సరికొత్త మేక్ఓవర్ లో కన్పించారు. లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. షారుఖ్ – అట్లీ చిత్రానికి “లయన్” అనే టైటిల్ పెట్టారనే ఊహాగానాలు వస్తున్నాయి. పూణేలోని సంత్ తుకారామ్ నగర్ మెట్రో స్టేషన్‌లో చిత్రీకరణకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాణ బృందం రాసిన లేఖలో ఈ చిత్రానికి “లయన్” అనే పేరు పెట్టారని పేర్కొన్నారు. ఆ లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read Also : తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్

అయితే గతంలో నందమూరి బాలకృష్ణ కూడా “లయన్” టైటిల్ తో వచ్చారు. సత్యదేవ్ దర్శకత్వంలో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది.

Exit mobile version