Site icon NTV Telugu

Shah Rukh Khan: వారి వల్లే నీ రెండు సినిమాలు హిట్ అయ్యాయి అన్న నెటిజన్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన షారుఖ్

Sharukh

Sharukh

Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హీరాణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సలార్ కు పోటీగా రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ కష్టకాలంలో ఉన్నప్పుడు పఠాన్ సినిమాతో దాన్ని పైకి లేపింది షారుఖ్ మాత్రమే.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకుంది. ఇక తన విజయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది జవాన్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు రికార్డ్ కలక్షన్స్ అందుకొని షారుఖ్ సత్తాను చూపించాయి. జవాన్ సినిమా నుంచి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్నాడు షారుఖ్. అభిమానులతో ముచ్చటిస్తూ సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. తాజాగా ఇలాగే చిట్ చాట్ సెషన్ లో ఒక నెటిజన్.. షారుఖ్ పై విరుచుకుపడ్డాడు. “మీ అత్యంత ప్రభావవంతమైన మరియు సమర్థవంతమైన PR బృందం కారణంగా మీ చివరి రెండు తట్టి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.ఇప్పుడు డంకీ కూడా అలాగే హిట్ అవుతుంది. బాలీవుడ్ నుంచి మరో గోల్డెన్ తట్టి సినిమా” అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఈ కామెంట్స్ పై షారుఖ్ స్పందించాడు. “సాధారణంగా మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను. కానీ మీ విషయంలో నేను మినహాయింపు ఇస్తున్నాను ఎందుకంటే మీరు మలబద్ధకం కోసం చికిత్స చేయవలసి ఉందని నేను భావిస్తున్నాను. నా PR బృందానికి కొన్ని బంగారు మందులు పంపమని చెబుతాను…మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను” అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి డంకీ సినిమాతో షారుఖ్ హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version