NTV Telugu Site icon

Jawaan: మళ్లీ లీకయిన ‘జవాన్’ క్లిప్.. పోలీసులకి ఫిర్యాదు!

Jawan New Release Date

Jawan New Release Date

Shah Rukh Khan Jawan Movie Clip Leaked Again: షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ జవాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక అంతేకాక సినిమా మీద క్యూరియాసిటీని పెంచేందుకు మేకర్స్ ప్రతి చిన్న విషయాన్ని వదలడం లేదు. ఇక ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ముందే మేకర్స్‌కి పెద్ద షాక్ తగిలిందని అంటున్నారు. అదేమంటే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్స్ మేకర్స్ నుంచి దొంగిలించబడ్డాయని ఆ తరువాత ఆన్‌లైన్‌లో లీక్ చేశారని అంటన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కాపీరైట్ ఉల్లంఘన గురించి గురువారం శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం, ఆగస్టు 10న, ఐటీ చట్టం కింద, ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌లో షారుఖ్ కంపెనీ రెడ్ చిల్లీస్ తరపున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.

Ankita Lokhande: సుశాంత్ మాజీ ప్రియురాలి ఇంట తీవ్ర విషాదం

జవాన్ నుండి లీక్ అయిన క్లిప్‌లను షేర్ చేసిన ఐదు ట్విట్టర్ హ్యాండిల్స్‌ను మేకర్స్ గుర్తించారని, వారికి లీగల్ నోటీసులు కూడా పంపినట్లు చెబుతున్నారు. ఒక ట్విట్టర్ హ్యాండిల్ నోటీసులు అంగీకరించినట్లు సమాచారం. జవాన్ క్లిప్ లేదా ఫోటో ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఇది మొదటి సారి కాదు మూడోసారి. కొన్ని నెలల క్రితం, ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఫైట్ చేసున్న ఒక స్లో-మోషన్ యాక్షన్ సీక్వెన్స్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లీక్ అయింది. ఆ సమయంలో రెడ్ చిల్లీస్ క్లిప్‌లను తొలగించాలని కోర్టును ఆశ్రయించింది. తరువాత, ఈ సినిమా నుంచి షారుఖ్ ఖాన్ బట్టతల లుక్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్, వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతితో పాటు దీపికా పదుకొణె కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ జవాన్ సెప్టెంబర్ 7న భారతదేశ వ్యాప్తంగా విడుదల కానుంది.

Show comments