Site icon NTV Telugu

షారూఖ్ దీపావళి ప్రకటన వివాదం

Shah-Rukh-Khan

Shah-Rukh-Khan

దీపావళికి పది రోజుల ముందు చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ కొత్త ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించారు. ఈ దీపావళికి స్థానిక దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయాలని ఈ ప్రకటనలో క్యాడ్‌బరీ తన వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. ‘కోవిడ్ సమయంలో నష్టపోయిన పెద్ద వ్యాపారాలు, బ్రాండ్‌లు మళ్ళీ పుంజుకున్నాయి. కానీ చిన్న దుకాణాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి’ అని ప్రారంభమయ్యే ఈ యాడ్ 2.18 నిమిషాలు ఉంది. అందులోనే ‘గత సంవత్సరం దీపావళికి చిన్న వ్యాపారాలకు సహాయం చేసాము. భారతదేశపు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్‌ను వారి బ్రాండ్ అంబాసిడర్‌ చేయడం ద్వారా ఈ సంవత్సరం మళ్లీ చేయలనుకుంటున్నాము’ అని చెప్పారు.

Read also : ‘ఐకాన్‌’ మళ్ళీ ఆగనుందా!?

ఇక ఈ ప్రకటనలో షారూఖ్ దీపావళి పండుగను జరుపుకోవడానికి వీలుగా ప్రజలు చుట్టుపక్కల ఉన్న చిన్న దుకాణాలలో బట్టలు, పాదరక్షలు, వస్తువులను కొనుగోలు చేయమని కోరారు. ఇది ఆలోచింపజేసేదే. అయితే షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాల కేసు నడుస్తున్నందు వల్ల తనను ప్రకటనలో లేకుండా చేయమని సోషల్ మీడియా వినియోగదారులలో కొంత మంది #BoycottCadbury అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

https://www.youtube.com/watch?v=tNeJ5U58uf4
Exit mobile version