దీపావళికి పది రోజుల ముందు చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ కొత్త ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించారు. ఈ దీపావళికి స్థానిక దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయాలని ఈ ప్రకటనలో క్యాడ్‌బరీ తన వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. ‘కోవిడ్ సమయంలో నష్టపోయిన పెద్ద వ్యాపారాలు, బ్రాండ్‌లు మళ్ళీ పుంజుకున్నాయి. కానీ చిన్న దుకాణాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి’ అని ప్రారంభమయ్యే ఈ యాడ్ 2.18 నిమిషాలు ఉంది. అందులోనే…