Site icon NTV Telugu

Samantha: ‘శాకుంతల’ కొత్త రిలీజ్ డేట్ ఇచ్చేశారుగా….

Samantha

Samantha

Shaakuntalam: స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ కొత్త విడుదల తేదీని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమా ఏప్రిల్ 14న రాబోతోందని తెలిపారు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించిన ‘శాకుంతలం’ లో టైటిల్ రోల్ ను సమంత పోషించింది. అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాల భరతుడి పాత్రలో మెరిసింది. మణిశర్మ స్వరరచన చేసిన ఈ చిత్రంలో మోహ‌న్ బాబు, ప్ర‌కాశ్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను త్రీడీలోనూ విడుదల చేయబోతున్నారు.

భారీ చిత్రాలతో పోటీ!
‘శాకుంతలం’ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతోందనే ప్రకటన రాగానే ఫిల్మ్ ట్రేడ్ వర్గాలలో కొత్త సందేహం మొదలైంది. ఇది పాన్ ఇండియా మూవీ, తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల కావాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 14న ఇప్పటికే పలు చిత్రాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. అందులో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ కూడా ఉంది. అలానే రజనీకాంత్ ‘జైలర్’ మూవీ సైతం అదే తేదిన విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇక లారెన్స్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రుద్రుడు’ కూడా అదే తేదీకి వస్తుందనే ప్రకటన ఇప్పటికే వచ్చింది. తెలుగులో అల్లరి నరేశ్ నటిస్తున్న ‘ఉగ్రం’ రిలీజ్ డేట్ కూడా అదేనని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. వీటిలో ‘జైలర్’ మూవీ రిలీజ్ వాయిదా పడొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి మిగిలిన సినిమాల పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన, ‘శాకుంతలం’ మాత్రం మరోసారి వాయిదా పడకుండా అదే తేదీకి వస్తుందేమో చూద్దాం.

Exit mobile version