Site icon NTV Telugu

SSMB29 : క్రేజీ హింట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

SSMB29

SSMB29 పై ప్రముఖ స్క్రీన్ రైటర్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్రేజీ హింట్ ఇచ్చి మహేష్ అభిమానులను థ్రిల్ చేశారు. RRR సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “మహేష్ సినిమా కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కథను తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్‌పై దృష్టి సారిస్తారు” అని అన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే భారతదేశపు మొట్ట మొదటి యాక్షన్ అడ్వెంచర్ అవుతుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

Read Also : RRR : ఈ హీరోలకు ఛాన్స్ మిస్… రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

ఇక ఇప్పటికే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లను మించి ఈ ప్రాజెక్ట్ ఉంటుందని రాజమౌళి అప్పుడే SSMB29పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు. రాజమౌళి ఊరించడం ఒకెత్తయితే, ఇపుడు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన అప్డేట్ మహేష్ అభిమానులను మరింత ఖుషి చేస్తోంది. కాగా ఈ ప్రాజెక్ట్ 2023 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు రాజమౌళి అండ్ టీం “ఆర్ఆర్ఆర్” విడుదల గురించి వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే అంటే మార్చ్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Exit mobile version