Naresh : సీనియర్ నరేష్ ఎప్పటికప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అలాంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ నటుడు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. తాను రెండు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని.. 200కు పైగా నిర్మాతలను చూశానని తెలిపారు.
Read Also : Mega Heros : మెగా హీరోల అనుబంధం.. తమ్ముడికి అన్న ముద్దు
అయితే చాలామంది నిర్మాతలు ఆర్టిస్టులకు కేవలం డబ్బులు ఇస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ కష్టపడి పని చేసే వారికి కేవలం డబ్బులు ఇస్తే సరిపోదు. కాస్తంత మర్యాద కూడా ఇవ్వాలి. ఈ విషయంలో నిర్మాత రాజేష్ చాలా బెటర్. ఆయన ఆర్టిస్టులకు ఎంతో గౌరవం ఇస్తుంటారు. అందుకే రాజేష్ అంటే నాకు చాలా ఇష్టం. కిరణ్ అబ్బవరం సినిమా హిట్ కావడం చాలా సంతోషంగా ఉంది. యంగ్ టీం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది. అందుకు ఈ సినిమా విజయం మరో నిదర్శనం అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.
Read Also : Allu Shireesh : శిరీష్ కు కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన స్నేహారెడ్డి..
