Radhika Sharathkumar: చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నటి రాధికా శరత్ కుమార్. బోల్డ్ గా నటించాలన్నా ఆమె.. బోల్డ్ గా మాట్లాడాలన్నా ఆమె.. నిజాన్ని నిక్కచ్చిగా అందరిముందు చెప్పగల సత్తా ఉన్న నటి రాధికా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాధికా తాజాగా లవ్ టుడే సినిమాలో కీలక పాత్రలో నటించింది. కోలీవుడ్ లో హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.ఇక ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం పాల్గొని సినిమా గురించి విశేషాలను పంచుకొంటుంది. ఇక తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో రాధికా బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్పుడున్న కాలంలో ఒక అమ్మాయి, ఒక భార్యతో మాత్రమే ఉంటున్నాం.. వేరే అమ్మాయి గురించి కలలో కూడా ఆలోచించం అనే మగాళ్లు ఉంటే చేతులు ఎత్తండి అని రాధికా ఓపెన్ సవాల్ విసిరింది. “ఇక్కడ ఉన్నవారిలో నేను ఒక్క అమ్మాయినే ప్రేమించాను.. వేరే అమ్మాయి గురించి ఆలోచించకుండా నా భార్యతోనే ఉంటున్నాను అని చెప్పగల దమ్ము ఏ మగాడికైనా ఉందా..? ” అని అడిగేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. వెంటనే ఈ సవాల్ కు డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నేను ఉన్నాను అని అనగా.. ‘ఒక్కరే..సైడ్ లో ఇద్దరు’అని చెప్పి పంచ్ వేసింది. దీంతో అనిల్ సైతం సైలెంట్ అయ్యాడు. నవ్వుతూ, వేరొకరిని నొప్పించకుండా సవాల్ విసరడంలో రాధికా తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే లవ్ టుడే సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
