సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ ఇప్పటికీ మంచి ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తోంది. ఆమె ఇటీవల వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె తాజా ఫోటోలు నెటిజన్లను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఖుష్బూ తాజాగా తన లేటెస్ట్ వెయిట్ ట్రాన్స్ఫార్మేషన్ లుక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also : పారిస్‌లో “అఖండ” జాతర… అంతా సిద్ధం
“20 కేజీలు తగ్గాను. నేను నా బెస్ట్ హెల్త్ రొటీన్ లో ఉన్నాను. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే సంపద. నేను అనారోగ్యంతో ఉన్నానా ? అని అడిగే వారి ఆందోళనకు ధన్యవాదాలు. నేనెప్పుడూ అంత ఫిట్‌గా లేను. మీలో 10 మందిని అయినా బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి ప్రేరేపించినట్లయితే నేను విజయం సాధించినట్లే” అంటూ ముందుగానే తాను బరువు తగ్గడంపై ట్రోల్ చేసేవారికి కౌంటర్ వేసింది.
గత సంవత్సరం ఖుష్బు లాక్ డౌన్ టైం నుంచి ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. అప్పటి నుంచి సరైన డైట్ ను ఫాలో అవుతూ ఏకంగా 20 కేజీలు తగ్గి ఫిట్నెస్ గురించి ఆందోళన చెందేవారికి స్ఫూర్తిదాయకంగా మారింది. 51 ఏళ్ల నటి తన స్లిమ్ లుక్ లో 30 ఏళ్ల మహిళలా కన్పిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.