ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లందరూ రీ ఎంట్రీల మీద పడ్డారు. ఒకప్పుడు తమ అందం, అభినయాలతో అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు స్టార్ హీరోలకు అమ్మలుగా, అత్తలుగా కనిపించి మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి లిస్టులోకి చేరిపోయింది సీనియర్ నటి అర్చన. నిరీక్షణ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అర్చన భారత్ బంద్, లేడీస్ టైలర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందులో ఆమె నటించిన తీరు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది.
ఇక ఈమె ఆకాష్ పూరి నటిస్తున్న చోర్ బజార్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్చన ఒక కీలక పాత్రలో కనిపించనున్నదట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమలో ఆకాష్ పూరి సరసన గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది.మరి ఈ సినిమాతో అర్చన మరోసారి బిజీగా మారుతుందేమో చూడాలి.
