Site icon NTV Telugu

Mahesh Babu: మహేష్ బాబుకి యాక్టింగ్ క్లాసులు చెబుతున్న సీనియర్ నటుడు

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: గుంటూరు కారం సినిమాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఒకపక్క బాడీ పెంచుతూనే మరో పక్క వర్క్ షాప్ చేసే విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. లుక్ విషయంలో ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి నుంచి ఆదేశాలు ఉండడంతో ఆ విషయం మీద కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు ఇప్పటికే కొన్ని వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ వర్క్ షాప్స్ లో మహేష్ బాబుకి సీనియర్ యాక్టర్ నాజర్ ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Saripodhaa Sanivaaram: చారులతగా ఆకర్షిస్తున్న ఓజి హీరోయిన్

ఈ సినిమాని కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహా సినిమా అని ముందు నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాకి కథ అందించడం పూర్తయిందని ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే రాజమౌళి సినిమాని ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్స్ లో మహేష్ బాబుకి ట్యూటర్ గా నాజర్ వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు డైలెక్ట్ విషయంలో నాజర్ మెళుకువలు నేర్పిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ తో నాజర్ చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా అతడులో తాత, పోకిరీలో తండ్రి పాత్రల్లో నటించారు.

Exit mobile version