Kota Srinivasa Rao: మొన్న చిరంజీవి.. నేడు పవన్.. ఎందుకంత ద్వేషం కోటా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు నటన గురించి, ఆయన చేసిన పాత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు అనే పదానికి పర్యాయ పదం అంటే కోటానే. ఇప్పుడు ఆయన వయస్సు 73 .. ఇప్పటికి ఏదో ఒక సినిమాలో కోటా కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఆయన వ్యక్తిగతంగా ఏరోజు ఎవరిని తక్కువచేసి మాట్లాడింది లేదు.. ఒక్కరిపై ద్వేషాన్ని చూపించింది లేదు. అయితే గత కొన్నిరోజులుగా కోటా.. మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు. పరోక్షంగానో, ప్రత్యేక్షంగానో మెగా బ్రదర్స్ పై ద్వేషాన్ని చూపిస్తున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. గతంలో.. కోటా మెగాస్టార్ చిరంజీవి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. చిత్రపురిలో చిరు.. హాస్పిటల్ నిర్మిస్తున్నాడు అన్న వార్త రాగానే కోటా ఓకే ఇంటర్వ్యూలో.. ” ముందు సినీ కార్మికులకు తిండి పెట్టండి. నీ హాస్పిటల్‌కి ఎవడొస్తాడు. నాకు పని ఉందనుకోండి. నాలుగు డబ్బులొస్తాయి. అపోలో హాస్పిటల్‌కే వెళతారు. ఎంత టాలెంట్ అలా కృష్ణానగర్‌లో చాలా మంది దర్శకులు పని లేక తాగుడు తందనాలతో పాడైపోతున్నారు. హాస్పిటల్ లాంటి కబుర్లెందుకు. నాకు చిరంజీవిగారంటే చాలా గౌరవం. నేను కూడా కార్మికుడినే అని అంటున్నారు. కోట్లు తీసుకుని సినిమాలు చేసే వ్యక్తి కార్మికుడు ఎలా అవుతాడు. ఎందుకా మాటలన్నీ. ఏదైనా సాయం చేయాలనిపిస్తే చేయాలంతే. ఇప్పటి వరకు ఐదారు లక్షలు ఆర్టిస్టులకు సాయం చేసుంటాను” అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు నెట్టింట పెను సంచలనాన్నే సృష్టించాయి.
Gunturu Karam: ‘గుంటూరు కారం’ షర్ట్ లమ్మా..ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. రావాలమ్మా
Also Read
ఇక ఇప్పుడు పరోక్షంగా పవన్ పై ఘాటు విమర్శలు చేశాడు కోటా. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ” అప్పటి సినిమాలా ఇప్పుడు లేదు.. అంతా సర్కస్ లా ఉంది. ఇప్పుడు హీరోలు రోజుకి రూ.2కోట్లు, రూ.6 కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు.. రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా” అని ప్రశ్నించారు. అయితే ఇది స్టార్ హీరోలందరికీ వర్తిస్తుంది అని చెప్పుకున్నా.. ఆయన 2 కోట్లు అని ఫిగర్ చెప్పడం, అది కూడా పబ్లిక్ గా చెప్పడం అని చెప్పడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్.. ఒక సభలో.. తానూ రోజుకు రెండు కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటాను అని పబ్లిక్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు కోటా పవన్ వ్యాఖ్యలపైనే సెటైర్ వేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక అసలు మెగా బ్రదర్స్ పై కోటాకు ఎందుకంత ద్వేషం అంటే .. దానికి కూడా ఒక కథను చెప్పుకొస్తున్నారు.
Keerthy Suresh: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమెనే…
మా ఎలక్షన్స్ సమయంలో కోటా.. మంచు విష్ణు ప్యానెల్ కు సపోర్ట్ గా నిలిచాడు. చిరు నిలబెట్టిన వ్యక్తి ప్రకాష్ రాజ్ పై గౌరవం ఉన్నా.. అతడు మనవాడు కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ వ్యాఖ్యలపై రెచ్చిపోయిన మెగా బ్రదర్ నాగబాబు.. కాటికి పోయే ముసలోడికి రాజకీయాలు ఎందుకు అనేలా మాట్లాడిన విషయం తెల్సిందే. అంత మాటలు అన్నా చిరు కానీ, పవన్ కానీ.. నాగబాబును మందలించకపోవడం.. కోటాకు సపోర్ట్ చేయకపోవడంతోనే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా కోటా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!