Site icon NTV Telugu

మిడ్ నైట్ సర్ప్రైజ్… “సీటిమార్” అంటున్న దర్శకుడు

Seetimaarr director’s midnight tweet builds up excitement

“మిడ్ నైట్ సర్ప్రైజ్” అంటూ యంగ్ డైరెక్టర్ సంపత్ నంది తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Read Also : “ఆర్ఆర్ఆర్” సంక్రాంతికే ఫిక్స్ ?

స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 3న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన “కబడ్డీ” సాంగ్ కు సానుకూల స్పందన లభిస్తోంది. చిత్ర దర్శకుడు సంపత్ నంది అర్ధరాత్రి చేసిన ట్వీట్ అంచనాలను మరింత పెంచింది. సంపత్ నంది నిన్న రాత్రి ట్విట్టర్‌లో “సీటీమార్” థియేట్రికల్ ట్రైలర్ కోసం డిటిఎస్ మిక్సింగ్ వర్క్ జరుగుతున్న వీడియోను పంచుకున్నారు. “ఆన్ ది వే… మీ విజిల్స్ సిద్ధం చేసుకోండి” అని సంపత్ ట్వీట్ చేశారు.

Exit mobile version