“ఆర్ఆర్ఆర్” సంక్రాంతికే ఫిక్స్ ?

“ఆర్ఆర్ఆర్” మేకర్స్ నిన్ననే సినిమా షూటింగ్ పార్ట్‌ మొత్తం పూర్తయ్యిందని స్పష్టం చేసారు. ప్రసతుతం సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తిగా దృష్టి పెట్టింది. అయితే కొంతకాలంగా సినిమా విడుదల తేదికి సంబంధించి గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం సినిమాను జనవరి నాటికి పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపబోతున్నారట. ఈ మేరకు మేకర్స్ థియేటర్స్ లాక్ చేయమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుని అక్టోబర్ చివరి నాటికి మొదటి కాపీ సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క టాలీవుడ్ లోనే సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. మరెక్కడా థియేటర్లు ఓపెన్ చేయలేదు. ఇప్పటికే “బెల్ బాటమ్” విడుదల చేసిన అక్షయ్ నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. ఈ సినిమా ఎఫెక్ట్ పాన్ ఇండియా సినిమాలు అన్నింటికీ మేల్కొలుపుగా మారింది. దీంతో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ విషయంలో అలెర్ట్ అవుతున్నాయి.

Read Also : రేప్ కేసుపై హైకోర్టు తీర్పు… తాప్సి షాకింగ్ రియాక్షన్

అందుకే మొత్తం భారతీయ థియేట్రికల్ మార్కెట్ తిరిగి తెరిచిన తర్వాత మొదటి బెస్ట్ హాలిడే సీజన్‌లో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య సంక్రాంతికి రానున్న అన్ని పెద్ద చిత్రాల నిర్మాతలతో సమావేశం కానున్నారని అంటున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. “ఆచార్య”, “భీమ్లా నాయక్”, “సర్కారు వారి పాట”, “రాధే శ్యామ్” నిర్మాతలు ఇప్పుడు కొత్త విడుదల తేదీల గురించి అయోమయంలో ఉన్నారు. డిసెంబర్ నాటికి ఉత్తర భారత మార్కెట్ తిరిగి తెరవలేకపోతే “ఆర్ఆర్ఆర్” ఖచ్చితంగా 2022 వేసవిలో విడుదలవుతుంది. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి 2022న విడుదల చేయడానికే మేకర్స్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలైతే ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేకపోలేదు. స్వాతంత్య్రానికి ముందు జరిగే ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రధారులు.

-Advertisement-"ఆర్ఆర్ఆర్" సంక్రాంతికే ఫిక్స్ ?

Related Articles

Latest Articles