Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Horror Thriller OTT : రాత్రి వేళ ఒంటరిగా కూర్చొని హారర్ సినిమా చూస్తున్నప్పుడు సడెన్ గా గుండె వేగం పెరగడం, తర్వాతి సీన్లో ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠతో కళ్లప్పగించి స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి ఇష్టమైన అనుభవమే. అలాంటి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని వచ్చిన బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇంటర్నేషనల్ గా ‘సక్యుబస్’ (Succubus)పేరుతో విడుదల అయిన ఈ సినిమాను, ఇండియాలో ‘సెడ్యూసర్’ (Seducer)పేరుతో విడుదల చేశారు. జానపద కథలు, పురాణాల్లో కనిపించే మోహినీ పిశాచి ఆధారంగా చేసుకుని ఈ కథను నిర్మించారు. మగాళ్ల బలహీనతలను, ముఖ్యంగా వాళ్ళ కోరికలను ఆయుధంగా మార్చుకుని వెంటాడే ఈ కామిని బోల్డ్ హారర్ థ్రిల్లర్ ను ఆడియన్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. 2024లో ఈ సినిమా విదేశాల్లో థియేటర్లలో విడుదలైంది. అయితే ఇండియాలో మాత్రం దీనిని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లోనే విడుదల చేశారు.
జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్
2024లో వచ్చిన రష్యన్ మూవీ ‘సెడ్యూసర్’ ఇప్పుడు భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇది మే 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉన్న ఈ మూవీ, థ్రిల్లింగ్ హారర్ కోరుకునే ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం 92 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమా అనవసరమైన సన్నివేశాలకు చోటివ్వకుండా వేగంగా సాగుతుంది. ఇక ఈ సినిమాను రష్యన్ దర్శకుడు అలెగ్జాండర్ డొమొగరోవ్ జూనియర్ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించగా, ఇందులో ప్రధాన పాత్రల్లో అంజెలీనా స్ట్రెచినా, రోమన్ వాసిలీవ్, మిఖాయిల్ త్రోయినిక్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు.
Also Read
- Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
‘సెడ్యూసర్’ సినిమా స్టోరీ
సినిమా కథ చాలా సింపుల్‌గా, భయపెట్టేలా ఉంటుంది. కొందరు సిటీ యువకులు సరదాగా ఎంజాయ్ చేయడానికి ఒక మారుమూల పల్లెటూరికి వెళ్తారు. అయితే దురదృష్టవశాత్తూ వాళ్ళు అక్కడ ఒక ప్రమాదకరమైన కామిని దెయ్యం ఉన్న ప్రాంతంలోకి అడుగుపెడతారు. ఆ దెయ్యం మామూలు దెయ్యాల లాంటిది కాదు. అది మనుషుల రూపాన్ని మార్చుకోగలదు. గ్రూపులోని యువకుల భయాన్ని, వాళ్ళ బలహీనతలను వాడుకుంటూ వారిని ఒక్కొక్కరిగా తన వలలో వేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ దెయ్యం మనుషుల మనసుల్లో ఉండే కామ వాంఛలను బయటకు తీసి, వాళ్ళని పూర్తిగా మార్చేస్తుంది. ఒకరినొకరు అనుమానించుకునేలా చేస్తూ, వారి మధ్య గొడవలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతుంది. ఈ క్రమంలోనే కథ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. చివరకు ఆ మాయా ఆత్మ నుంచి ఆ యువకులు తప్పించుకున్నారా ? అసలు ఆ ఊరి వెనుక ఉన్న రహస్యం ఏంటి ? అనే విషయాలను ఈ బోల్డ్ హారర్ థ్రిల్లర్ ను చూసి తెలుసుకోండి.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..