Site icon NTV Telugu

Ugram: యాక్షన్ సినిమా నుంచి ఫ్యామిలీ సాంగ్…

Ugram

Ugram

అల్లరి నరేష్ పేరులో నుంచి ‘అల్లరి’ని పూర్తిగా తీసేసి, అతని కెరీర్ కి కొత్త ‘నాంది’ పలికాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఆడియన్స్ అల్లరి నరేష్ నుంచి ఊహించని చేంజ్ ఓవర్ ని చూపిస్తూ బయటకి వచ్చిన నాంది సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఉగ్రం’. నాంది స్టైల్ లోనే అల్లరి నరేష్ ని పూర్తిగా కొత్త మేకోవర్ లో, పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా విజయ్ ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ని చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడున్న బజ్ కి కాస్త అబోవ్ యావరేజ్ అనే టాక్ తోడైనా చాలు అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కాంబినేషన్ లో సూపర్ హిట్ పడినట్లే. పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందుతున్న ఉగ్రం సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Read Also: Agent: గన్ను పట్టుకోని గన్నులా ఉన్నాడు…

ఎంత యాక్షన్ ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ కూడా ఉగ్రం సినిమాలో ఉందని ఇప్పటికే టీజర్ చూస్తే అర్దమయిపోతుంది. దాన్ని మరింత బలంగా ప్రాజెక్ట్ చెయ్యడానికి మేకర్స్ ఉగ్రం మూవీ నుంచి ‘అల్బెలా’ సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఉగ్రం సినిమా నుంచి సెకండ్ సాంగ్ గా బయటకి వస్తున్న ఈ సాంగ్ ఏప్రిల్ 9న 11:07 నిమిషాలకి రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో హీరో, హీరోయిన్, పాప కూడా ఉండడంతో పోస్టర్ చాలా లైవ్లీగా ఉంది. మరి మే 5న రిలీజ్ కానున్న ఉగ్రం మూవీతో అల్లరి నరేష్, విజయ్ కనకమేడల హిట్ హిస్టరీని రిపీట్ చేస్తారేమో చూడాలి.

Exit mobile version