అక్కినేని నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం థాంక్యూ. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన రాశిఖన్నా మాళవికా నాయర్ అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో చైతన్య కాలేజ్ స్టూడెంట్ గా, హాకీ క్రీడాకారుడిగా, యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా మూడు విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఏంటో ఏంటేంటో..` అంటూ సాగే యువతను ఆకట్టుకొంటుంది. ఈ సాంగ్ లో చైతూ సరసన మాళవిక నాయర్ కనిపించింది. టాక్సీవాలా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ చాలా రోజుల తరువాత ఈ సినిమాలో కనిపించింది. కాలేజ్ రోజుల్లో యంగ్ చైతన్య ప్రేమ ప్రయాణాన్ని చూపించారు. తన క్లాస్ మేట్ ప్రేమలో పడిన ఒక అమ్మాయి అతని కోసం ఏం చేసింది.. ఆ వయస్సులో ఆమెకు అతడిపై ఉన్న ఫీలింగ్ ఎలా ఉన్నాయి అని ఈ సాంగ్ ద్వారా తెలిపారు.
ముఖ్యంగా టీనేజ్ లో ఒక అమ్మాయికి, అబ్బాయి మీద వచ్చే భావాలను అనంత శ్రీరామ్ ఎంతో చక్కగా క్యాచీ పదాలతో రాశాడు. ఇక అరబిక్ కుత్తు, మ.. మ .. మహేశా సాంగ్స్ తరువాత జోనితా గాంధీ ఒక స్లో మోషన్ రొమాంటిక్ సాంగ్ ను ఆలపించింది. ఆమె గొంతు ఎంతో ప్లజెంట్ గా ఉండి మెస్మరైజ్ చేస్తోంది. ఇక థమన్ సంగీతం అద్భుతం.. యంగ్ లుక్ లో నాగచైతన్య ప్రేమమ్ సినిమాను గుర్తుచేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 8న రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో అక్కినేని హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.