‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి విభిన్నమైన చిత్రాలతో యంగ్ హీరో సత్యదేవ్ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల అద్భుతమైన నటుడు సత్యదేవ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనను బిగ్ ఆఫర్లు కూడా పలకరిస్తున్నాయి. తాజాగా ఆయనకు ఓ మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” రీమేక్ లో సత్యదేవ్ కూడా నటించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర రివీల్ అయ్యింది.
Read Also : “మనీతో పాటూ మనసులు కూడా గెలుచుకో”మంటోన్న ఎన్టీఆర్!
సత్యదేవ్ ఒరిజినల్ మూవీలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో కన్పించబోతున్నాడట. సమాచారం ప్రకారం సత్యదేవ్ ఈ రీమేక్ లో పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించబోతున్నాడు. ఇక మెగాస్టార్ సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ డ్రామాలో నయన్ సిఎమ్ కుమార్తె పాత్రను పోషిస్తుంది. “లూసిఫర్” రీమేక్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది.