సత్యదేవ్ కు అదిరిపోయే మెగా ఆఫర్

Satydev role in Chiranjeevi film revealed

‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి విభిన్నమైన చిత్రాలతో యంగ్ హీరో సత్యదేవ్ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల అద్భుతమైన నటుడు సత్యదేవ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనను బిగ్ ఆఫర్లు కూడా పలకరిస్తున్నాయి. తాజాగా ఆయనకు ఓ మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” రీమేక్ లో సత్యదేవ్ కూడా నటించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర రివీల్ అయ్యింది.

Read Also : “మనీతో పాటూ మనసులు కూడా గెలుచుకో”మంటోన్న ఎన్టీఆర్!

సత్యదేవ్ ఒరిజినల్ మూవీలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో కన్పించబోతున్నాడట. సమాచారం ప్రకారం సత్యదేవ్ ఈ రీమేక్ లో పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించబోతున్నాడు. ఇక మెగాస్టార్ సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ డ్రామాలో నయన్ సిఎమ్ కుమార్తె పాత్రను పోషిస్తుంది. “లూసిఫర్” రీమేక్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది.