సత్యజిత్ రే స్మారక పురస్కారం పొందిన బి. గోపాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు బి. గోపాల్ ప్రతిష్ఠాత్మకమైన సత్యజిత్ రే స్మారక పురస్కారం అందుకున్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత మూడేళ్ళుగా కేరళకు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్యజిత్ రే స్మారక పురస్కారంతో సత్కరిస్తోంది.
Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
Also Read
గతంలో ఈ అవార్డులను ఆదూర్ గోపాలకృష్ణన్ , బెంగాలీ నటి మధబ్ ముఖర్జీ , నిర్మాత జి. మోహన్ స్వీకరించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు బాలు కిరియత్, సంగీత దర్శకుడు పెరుంబవూర్ జీ రవీంద్రనాథ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులతో కూడిన ప్యానల్ ఇప్పుడీ అవార్డుకు దర్శకులు బి. గోపాల్ ను ఎంపిక చేసింది. రవీంద్రభారతిలో 12వ తేదీ సాయంత్రం జరిగిన సత్కార సభలో మామిడి హరికృష్ణతో పాటు సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీకి చెందిన సజన్ లాల్, సెబాస్టియన్, అజిత్ తదితరులు పాల్గొని, బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. సత్యజిత్ రే వంటి గొప్ప దర్శకుని పేరుతో ఇస్తున్న అవార్డును స్వీకరించడం ఆనందంగా ఉందని బి. గోపాల్ అన్నారు. తెలుగు, హిందీ భాషలలో దాదాపు 35 చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు బి. గోపాల్ తాజాచిత్రం ‘ఆరుడుగుల బుల్లెట్’ గత వారమే విడుదలైంది.

తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!