Site icon NTV Telugu

Rajini Kanth : రజినీకాంత్ తో వివాదంపై స్పందించిన సత్యరాజ్

Satya Raj

Satya Raj

Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటుడు సత్యరాజ్ కు గొడవలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మొన్న కూలీ సినిమాలో 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం పెద్ద చర్చనీయాంశం అయింది. గతంలో శివాజీ సినిమాలో విలన్ గా ముందుగా సత్యరాజ్ ను అడిగితే.. తాను రజినీకాంత్ తో చేయనని చెప్పాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ గొడవపై తాజాగా సత్యరాజ్ స్పందించారు. నేను 1986లో వచ్చిన సినిమాలో వచ్చిన మిస్టర్ భరత్ సినిమాలో రజినీకాంత్ కు తండ్రిగా నటించాను. ఆ తర్వాత కూడా మేం చాలా సినిమాల్లో చేశాం. శివాజీ సినిమాలో నన్ను విలన్ గా అడిగిన మాట నిజమే అన్నారు సత్యరాజ్.

Read Also : Bachelor Heros : 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోలు

శివాజీ సినిమా టైమ్ లో నేను అప్పుడే హీరోగా సినిమాలు చేస్తున్నాను. ఆ టైమ్ లో నేను విలన్ గా చేస్తే బాగోదు అనిపించింది. అందుకే డైరెక్టర్ శంకర్ అడిగినా సరే నో చెప్పాను. అంతే తప్ప రజినీకాంత్ తో చేయొద్దని కాదు. పేపర్లలో ఏవేవో రాశారు. వాటిల్లో నిజం లేదు. రజినీకాంత్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కూలీ సినిమాతో అది కాస్త తీరిపోయింది అంటూ తెలిపాడు సత్యరాజ్. కూలీ సినిమాలో వీరిద్దరూ ఫ్రెండ్స్ గా చేశారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సత్యరాజ్ తెలుగులో రెండు సినిమాల్లో చేస్తున్నారు. రజినీకాంత్ నెల్సన్ మూవీలో బిజీగా ఉన్నారు.

Read Also : Malaika Arora : బాబోయ్.. 50 ఏళ్ల ఏజ్ లో కత్తిలాంటి అందాలు

Exit mobile version