AHA: ఊహకందని మలుపులతో ‘సత్తిగాని రెండెకరాలు’ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadeesh Prathap Bandari: తెలంగాణ నేపథ్యంలో చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో కొన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తమ సత్తా చాటుతున్నాయి. తాజాగా సిరిసిల్ల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘బలగం’ థియేటర్లలో హల్చల్ చేస్తుంటే… సంగారెడ్డి జిల్లా కొల్లూరు నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘సత్తిగాని రెండెకరాలు’ ఈ నెల 17 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే… ‘బలగం’ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించగా, ఈ ‘సత్తిగాని రెండెకరాలు’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. అలానే కరీంనగర్ నేపథ్యంలో సూర్యదేవర నాగవంశీ తీసిన ‘ఇంటింటి రామాయణం’ మూవీ సైతం విడుదలకు సిద్ధం అవుతోంది.
ఇక ‘సత్తిగాని రెండెకరాలు’ మూవీ విషయానికి వస్తే.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఆటో నడుపుకునే సత్తిగాడి జీవితం ఓ యాక్సిడెంట్ కారణంగా అల్లకల్లోలమౌతుంది. ఉన్న ఆటోను అమ్ముకోవడమే కాదు… రెండెకరాల భూమిని సైతం బేరానికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఊహించని సమస్యలు ఒకవైపు… వాటిని ఆసరాగా చేసుకుని అతని జీవితంతో ఆడుకునే మనుషులు మరోవైపు. ఈ జీవన్మరణ సమస్యల నడుమ సత్తిగాడు ఏం చేశాడు? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? అన్నదే ‘సత్తిగాని రెండెకరాలు’ చిత్రం. ‘పుష్ప’ సినిమాతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న జగదీశ్ ప్రతాప్ బండారి ఇందులో టైటిల్ రోల్ పోషించగా, ఇతర ప్రధాన పాత్రలను ‘వెన్నెల’ కిశోర్, బిత్తిరి సత్తి, మోహన శ్రీ సురాగ, రాజ్ తిరందాసు, అనీషా దామ పోషించారు. ఈ మూవీని అభినవ్ దండా తెరకెక్కించాడు.
Also Read
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు "పెద్ది" దెబ్బ.... విదేశాల్లోనూ షాకే!
- The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ మూవీ గురించి మాట్లాడుతూ, ”మాకెంతో బాగా నచ్చిన స్క్రిప్ట్ ఇది. అందుకే పేషన్ తో దీన్ని నిర్మించాం. ప్రేక్షకులు భిన్నమైన, సరికొత్త అనుభూతులను అందించాలన్నదే నిర్మాతలుగా మా కోరిక. ఆహాతో కలిసి ఈ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకెళ్ళడం ఆనందంగా ఉంది” అని అన్నారు. దర్శకుడు అభినవ్ మాట్లాడుతూ, ”నా మనసుకు ఎంతో దగ్గరైన కథ ఇది. దీన్ని సినిమాగా రూపొందించడమనేది నా వరకూ ఓ ఛాలెంజ్. జీవితం విలువ గురించి, కష్టకాలంలో మనుషుల మనస్తత్వంలో వచ్చే మార్పుల గురించి ఇందులోని పాత్ర ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేశాను” అని చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే… ఇందులో పాత్రలు, వాటి స్వభావాలు సహజ సిద్థంగా ఉన్నాయి. ఊహకందని మలుపులతో కథ సాగిపోతుందనిపిస్తోంది. ఈ యేడాది ఇప్పటికే మూడు చిత్రాలను విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ కు ‘సత్తిగాని రెండెకరాలు’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!