Site icon NTV Telugu

SarkaruVaari Paata Trailer: అందం మెయింటైన్ చేయలేక దూల తీరిపోతుంది

Maehsh

Maehsh

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు సర్కారువారి పాట ట్రైలర్ రిలీజ్ అవుతుందా..?  వింటేజ్ మహేష్ ను ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేసిన అభిమానులకు ఈ ట్రైలర్ పండగను తెచ్చిపెట్టింది.  పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం విదితమే. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముందు నుంచి చెప్తున్నట్లే మహేష్ ఊర మాస్ స్వాగ్ ని దింపేశారు. ”  నా ప్రేమను దొంగలించగలవు, నా స్నేహాన్ని దొంగలించగలవు, నా మనీని మాత్రం దొంగలించలేవు అంటూ మహేష్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమై  ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  విదేశాల్లో వడ్డీ వ్యాపారం చేస్తున్న మహేష్ .. తన దగ్గర తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోతే ఊరుకోడు. తన డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు . ఇక అక్కడే చదువుకుంటున్న కళావతి మాస్టర్స్ ఫినిష్ చేయడానికి మహేష్ దగ్గర అప్పు చేస్తోంది. అలా వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇలా సాగుతున్న క్రమంలో తన వద్ద అప్పుచేసి, తిరిగి చెల్లించని విలన్ కోసం మహేష్ ఇండియాకు వస్తాడు. అక్కడ విలన్ కు, హీరోకు మధ్య జరిగిన గొడవ ఎక్కడికి దారి తీసింది. అస్సలు మహేష్ ఎందుకు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.. ? చివరికి విలన్ దగ్గర నుంచి అప్పును వసూలు చేశాడా..? లేదా ? అనేది కథగా తెలుస్తోంది.

ఇక సినిమా మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో అని ట్రైలర్ ని బట్టి అర్ధం అవుతుంది. ప్రతి సీన్ లో మాస్ ఎలిమెంట్స్ ను పుష్కలంగా దట్టించేశారు. ఇక మహేష్ కామెడీ టైమింగ్, అందులోను పక్కన వెన్నెల కిషోర్ తో అంటే దూకుడు గుర్తుకువస్తుంది. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది  మహేష్ లుక్ గురించి, ఎంతో  హ్యాండ్సమ్ గా, చార్మింగ్ గా కనిపించాడు. ప్రతి ఫ్రేమ్ లోను మహేష్ తప్ప పక్కన వున్నవారు కనిపించడంలేదు అంటే అతిశయోక్తి కాదు. కీర్తి లుక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో బోల్డ్ డైలాగ్ తో మహేష్ కేక పెట్టించేశాడు. థమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశాడు.  మొత్తానికి ట్రైలర్ మాస్ స్వాగ్ తో అల్టిమేట్ గా ఉందని చెప్పాలి. దర్శకుడు పరుశురామ్ పడిన కష్టం ట్రైలర్ లో కనిపిస్తోంది. మరి ఈ సినిమా మే 12 న ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version