NTV Telugu Site icon

Sarkaru Vaari Paata: ఓటీటీలో రిలీజైన సినిమా.. కానీ ఓ ట్విస్ట్!

Sarkaru Vaari Paata On Ott

Sarkaru Vaari Paata On Ott

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’.. రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కానీ, ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటే.. రూ. 199 చెల్లించాలి. అంటే.. పే-పర్-వ్యూ విధానంలో ఈ సినిమాని ఇప్పుడే ఓటీటీలో వీక్షించొచ్చు. తొలుత ‘కేజీఎఫ్: చాప్టర్2’ ఇదే విధానంలో అందుబాటులోకి తెచ్చింది ప్రైమ్ వీడియో. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ విషయంలోనూ అదే స్ట్రాటజీని అమలు చేసింది. ఇప్పుడున్న క్రేజ్ దృష్ట్యా ఈ విధానంలో సినిమాని రిలీజ్ చేస్తే.. బాగా క్యాష్ చేసుకోవచ్చన్నదే ప్రైమ్ ఉద్దేశం.

కాగా.. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. రిలీజ్ రోజు మంచి టాక్ మూటగట్టుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీగా కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే బ్రేకీవన్ టార్గెట్‌ని అందుకోవడంతో పాటు రూ. 200 గ్రాస్ క్లబ్‌లోనూ ఈ సినిమా చేరిపోయింది. రీజనల్ సినిమాగా ఎన్నో ఘనతలు సాధించిన ఈ సినిమా.. పలు నాన్-రాజమౌళి రికార్డుల్ని కూడా నమోదు చేసింది. ప్రస్తుతం పే-పర్-వ్యూ విధానంలో స్ట్రీమ్ అవుతోన్న ఈ సినిమా.. కొన్ని రోజుల తర్వాత ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకి అందుబాటులోకి రానుంది.