Sarkaru Vaari Paata: ఓటీటీలో రిలీజైన సినిమా.. కానీ ఓ ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’.. రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కానీ, ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటే.. రూ. 199 చెల్లించాలి. అంటే.. పే-పర్-వ్యూ విధానంలో ఈ సినిమాని ఇప్పుడే ఓటీటీలో వీక్షించొచ్చు. తొలుత ‘కేజీఎఫ్: చాప్టర్2’ ఇదే విధానంలో అందుబాటులోకి తెచ్చింది ప్రైమ్ వీడియో. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ విషయంలోనూ అదే స్ట్రాటజీని అమలు చేసింది. ఇప్పుడున్న క్రేజ్ దృష్ట్యా ఈ విధానంలో సినిమాని రిలీజ్ చేస్తే.. బాగా క్యాష్ చేసుకోవచ్చన్నదే ప్రైమ్ ఉద్దేశం.
కాగా.. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. రిలీజ్ రోజు మంచి టాక్ మూటగట్టుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీగా కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికే బ్రేకీవన్ టార్గెట్‌ని అందుకోవడంతో పాటు రూ. 200 గ్రాస్ క్లబ్‌లోనూ ఈ సినిమా చేరిపోయింది. రీజనల్ సినిమాగా ఎన్నో ఘనతలు సాధించిన ఈ సినిమా.. పలు నాన్-రాజమౌళి రికార్డుల్ని కూడా నమోదు చేసింది. ప్రస్తుతం పే-పర్-వ్యూ విధానంలో స్ట్రీమ్ అవుతోన్న ఈ సినిమా.. కొన్ని రోజుల తర్వాత ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకి అందుబాటులోకి రానుంది.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!