యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. మ్యూజిక్ కంపోజర్ తమన్ ఆదివారం రాత్రి ట్విట్టర్‌లో కొత్త అప్‌డేట్ ఇచ్చి మహేష్ బాబు అభిమానులందరినీ థ్రిల్ చేశాడు.
Read Also : హాట్ సీట్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు… ఎన్టీఆర్ ప్లాన్ సూపర్
ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సర్కారు వారి పాట సెట్స్ నుండి ఒక ఫోటోను ట్వీట్ చేసారు. అందులో తమన్, పరశురామ్, నిర్మాత రవి, సినిమాటోగ్రాఫర్ మాధీ కలిసి ఉన్నారు. ఈ పిక్ ను షేర్ చేసిన తమన్ మేకర్స్ ఒక పాటను షూట్ చేయబోతున్నారని వెల్లడించాడు. “స్పెయిన్ లోని బార్సిలోనాలో పాటల షూటింగ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాము. సూపర్ స్టార్ ఎనర్జీని చూడటానికి చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాము” అంటూ ట్వీట్ చేశారు. అంటే ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతోంది. టీం స్పెయిన్ లోని అందమైన లొకేషన్లలో ఈ సాంగ్స్ ను చిత్రీకరిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.
