Site icon NTV Telugu

Sarkaru Vaari Paata: మహేష్ ఊర మాస్ సాంగ్.. వచ్చేసింది

Svp

Svp

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న  థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాంగ్ మ..మ.. మహేశా.. మహేష్ బాబు ఊర మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన ఈ సాంగ్ ను ఎట్టకేలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఊపు తెస్తోంది.

సన్నజాజి మూర తెస్తా సోమవారం.. మల్లెపూల మూర తెస్తా మంగళవారం.. అంటూ సాగిన ఈ సాంగ్ లో మహేష్, కీర్తి కలర్ ఫుల్ డ్రెస్ లతో కనిపించి మెప్పించారు. అనంత్ శ్రీరామ్ క్యాచీ లిరిక్స్, థమన్ మ్యూజిక్ , శ్రీ కృష్ణ, జోనిత గాంధీ మెస్మరైజింగ్ వాయిస్ అంతా ఒక ఎత్తు అయితే.. మహేష్ బాబు, కీర్తి సురేష్ ఊర మాస్ స్టెప్స్ మరో ఎత్తు అని చెప్పాలి. మహేష్ ఫ్యాన్స్ మహేష్ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అంతకుమించి అందించాడు పరుశురామ్. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version