సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా మొదటి పాట కళావతి సోషల్ మీడియాలో లీకైన విషయం తెల్సిందే. ఆరు నెలలు ఎంతో కష్టపడి చేసిన సాంగ్ ని చాలా ఈజీ గా నెట్లో పట్టేసాడు.. హృదయం ముక్కలయ్యింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్ అయినా సంగతి తెలిసిందే. ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన మేకర్స్.. ఈ సాంగ్ అనుకున్న సమయానికంటే ముందుగానే రిలీజ్ చేసి అభిమానుల కోపాన్ని తగ్గించారు. ప్రేమికుల రోజు కానుకగా ఈ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే కళావతి సాంగ్ ని రిలీజ్ చేశారు.
ఇక థమన్ చెప్పినట్లు ఈ సాంగ్ కోసం అందరు చాలా కష్టపడినట్లు సాంగ్ చూస్తుంటే తెలుస్తోంది. మహేష్ చార్మింగ్ లుక్స్ , కీర్తి హాట్ లుక్, సిద్ శ్రీరామ్ మెస్మరైజింగ్ వాయిస్ తో సాంగ్ అదిరిపోయింది. ‘వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ అంటూ కీర్తి ప్రేమలో పడిన మహేష్ ఆమె గురించి పొగుడుతూ కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి అని ఆమె లేకుండా ఉండలేను అని పూర్తిగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ డబ్బు గురించి ఎక్కడా తగ్గలేదని లొకేషన్స్ చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే సాంగ్ మొత్తాన్ని మహేష్ డామినేట్ చేశాడనే చెప్పాలి. ఆయన లుక్స్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12 న రిలీజ్ కానుంది. మరి ఈ సరి మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
