Site icon NTV Telugu

“సర్కారు వారి పాట”లో ఎవరెవరు ఏఏ పాత్రలు చేస్తున్నారంటే ?

Mahesh-Babu

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మేకర్స్ బార్సిలోనా షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు, మహేష్, కీర్తిపై ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇక నవంబర్ మొదటి వారంలో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నవంబర్ చివరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తరువాత “సర్కారు వారి పాట” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతికి జనవరి 13న థియేటర్‌లలోకి రానుంది.

Read Also : మరోసారి ఆసుపత్రిలో చేరిన రజినీకాంత్.. ఆందోళనలో అభిమానులు

ఇదిలా ఉండగా ఈ సినిమాలో సముద్రఖని, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఎవరెవరు ఏఏ పాత్రల్లో నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం సముద్రఖని బిజినెస్ మ్యాన్ గా, టెంపర్ వంశీ బిజినెస్ మ్యాన్ బాడీగార్డ్ గా, ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రిగా, తనికెళ్ళ భరణి హీరో తండ్రి ఫ్రెండ్ గా, పోసాని, వెన్నెల కిషోర్, సత్య కమెడియన్లుగా కనిపించబోతున్నారు. కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటిస్తుండగా, ఆమె కొలీగ్ గా సౌమ్యా మీనన్ నటిస్తున్నారు.

Exit mobile version