NTV Telugu Site icon

NBK108: బాలయ్య కోసం రంగంలోకి విలక్షణ నటుడు.. ఫోటో లీక్ చేసిన డైరెక్టర్

Balayya Anil Sarath

Balayya Anil Sarath

Sarath Kumar Playing Keyrole In NBK108: ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహా రెడ్డి’ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోనూ NBK108 సినిమా చేస్తున్నారు. ఇంతవరకు ఒక్క ఓటమి కూడా ఎరుగని దర్శకుడితో బాలయ్య జతకట్టడం, ఇందులో కామెడీ యాంగిల్ ఉండటంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ క్రేజీ అప్డేట్‌ని షేర్ చేశాడు. ఇందులో విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని వెల్లడించాడు. అంతేకాదు.. శరత్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఎప్పట్లాగే శరత్ కుమార్ ఫిట్‌గా, ఫ్యాబులస్‌గా ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. ఆయన ఏ పాత్ర పోషించనున్నారన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయకుండా, మిస్టరీగా పెట్టేశాడు. ఇక ఇందులో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. తండ్రికూతుళ్ల బంధం నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో బాలయ్యలో ఇదివరకెన్నడూ చూడని కామెడీ కోణాన్ని తాను చూపిస్తానని ఇదివరకే పలు ఇంటర్వ్యూలలో అని పేర్కొన్న సంగతి తెలిసిందే!

US On Modi-Putin Phone Call: మోదీ-పుతిన్ ఫోన్ కాల్‌పై అమెరికా రియాక్షన్ ఇది

మరోవైపు.. వీరసింహా రెడ్డి ఈ సంక్రాంతికి వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. అఖండతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య, క్రాక్‌తో తిరిగి ట్రాక్‌లోకి వచ్చిన గోపీచంద్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కడంతో.. దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రోమోలు, పాటలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా.. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.