Sara Ali Khan suffers burns on her belly: సైఫ్ అలీ ఖాన్ కుమార్ సారా అలీ ఖాన్ కేదార్నాథ్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మొదటి సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తూ వచ్చాయి. దీంతో ఆమె పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో భాగమవుతూ వచ్చింది. 2018 నుంచి దాదాపు అరడజను పైగా సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు ఏకంగా వారం గ్యాప్ లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె నటించిన మర్డర్ ముబారక్, ఏ వతన్ మేరే వతన్ అనే సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి. ఇక ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆమె కడుపుకి నిప్పు అంటుకుని గాయాలు అయ్యాయని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
HanuMan OTT: హనుమాన్ ఓటీటీ ఎంట్రీ కోసం వెయిట్ చేసే వారికి బాడ్ న్యూస్?
సారా అలీ ఖాన్ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేయబడింది. అందులో ఆమెకు ఒకపక్క మేకప్ చేస్తున్న సమయంలో మరొక టీమ్ మెంబర్ ఇది ఆనందంగా చెప్పే విషయం కాదు ఎందుకంటే సారా అలీ ఖాన్ కి గాయాలయ్యాయి అని ఆమె పేర్కొంది. ఇక వెంటనే సారా మాట్లాడుతూ రెండు సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తన పొట్ట కాలడం వల్ల ప్రమోషనల్ ఈవెంట్స్ కి వెంట వెంటనే హాజరు కాలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు అందరూ వీలైనంత త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నాం అంటూ కామెంట్లు పెట్టడం కనిపిస్తుంది. ఇక ఆమె నటించిన మర్డర్ ముబారక్ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 15వ తేదీన రిలీజ్ కాబోతోంది. అదే విధంగా ఏ వతన్ మేరే వతన్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మార్చి 21వ తేదీన రిలీజ్ కాబోతోంది.