Site icon NTV Telugu

Saptasagaralu Daati Side B: సూపర్ హిట్ మూవీ .. సీక్వెల్ డేట్ వచ్చేసింది

Rakshith

Rakshith

Saptasagaralu Daati Side B: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ దర్శకత్వం వహించిన చిత్రం సప్తసాగరాలు దాటి. గత నెల కన్నడ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది .. కానీ, కలక్షన్స్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక సైడ్ A .. సైడ్ B అంటూ టూ పార్ట్స్ ఉన్నాయని ముందుగానే చెప్పుకొచ్చారు. మొదటి పార్ట్ లో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం.. మధ్యలో హీరో జైలుకు వెళ్లడం.. హీరోను మర్చిపోలేక.. తల్లి కోసం.. హీరోయిన్ వేరొకరిని పెళ్లి చేసుకోవడం లాంటివి చూపించారు. ఇక సెకండ్ పార్ట్ లో.. పెళ్లి తరువాత కుడా హీరోయిన్.. హీరోను మర్చిపోలేక.. అతనితో కలిసి తిరగడం.. జైలు నుంచి వచ్చాక హీరో లో మార్పు.. ఇలాంటివి చూపించారు.

Renu Desai: మహేష్ తో సినిమా.. పెద్ద గొడవలు అవుతాయి

ఇక అసలైన ప్రేమకు అర్ధం చెప్పుకొచ్చారని అభిమానులు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. ఎప్పుడెప్పుడు సైడ్ B రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలా అలా ఎదురుచూసేవారికి మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. సప్తసాగరాలు దాటి సైడ్ B రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 7 న ఈ సినిమా అన్నిభాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. “విధి గమనంలో మార్పు వస్తుందా? సప్తసాగరాలు దాటి సైడ్ B అన్ని బాధల్లో నవంబర్ 7 న రిలీజ్ కానుంది” అని రక్షిత్ శెట్టి తెలిపాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Exit mobile version