NTV Telugu Site icon

Sapthami Gowda: కాంతార బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ‘తమ్ముడు’ తోనే..?

Saptami

Saptami

Sapthami Gowda: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరూ హిట్ ను అందుకుంటారు.. ఎవరు ప్లాపుని అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. ఎన్నో ఏళ్ళు కష్టపడి స్టార్ట్ అయినవారు కొంతమంది అయితే.. ఓవర్ నైట్ లో ఒక్క సినిమాతో స్టార్లుగా మారిన వారు మరి కొంతమంది. ఓవర్ నైట్ లో అని చెప్పడం కన్నా చాలా ఏళ్ల తర్వాత, ఎంతో కష్టం తర్వాత సక్సెస్ ను అందుకున్నారు అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఇక కాంతార సినిమాతో ఒక్కసారిగా స్టార్ట్ డమ్ ను అందుకున్న హీరోయిన్ సప్తమి గౌడ. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించి మెప్పించింది. ఒక గ్రామీణ యువతీగా, కానిస్టేబుల్ గా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత సప్తమి ఎక్కడా కనిపించింది లేదు. ఇకపోతే ఆమె ఎప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా అని చాలామంది అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకి ఇప్పుడు సమాధానం దొరికిందని సమాచారం అందుతుంది.

Brahmanandam: తిరుమలలో బ్రహ్మానందం..సెల్ఫీ కోసం పోటీ పడటంతో?

తాజాగా ఒక స్టార్ హీరో సినిమాలో సప్తమి హీరోయిన్ గా ఎంపిక అయిందని టాప్ నడుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. వేణు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం తమ్ముడు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన సప్తమి గౌడను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం అందుతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఆమెకు మంచి అవకాశం. మంచి ప్రొడక్షన్, స్టార్ హీరో కాబట్టి సప్తమికి మంచి గుర్తింపు వస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మేకర్స్ సప్తమిని అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించనున్నారట. మరి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ భామ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటుందా..? లేదా..? అనేది చూడాలి.