Saptami Gouda: కాంతార.. కాంతారా.. కాంతార ప్రస్తుతం ఎక్కడ విన్నా చిత్ర పరిశ్రమలో ఇదే పేరు మారుమ్రోగిపోతోంది. ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే టాలీవుడ్ కు తెలియవనే చెప్పాలి.. కానీ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కన్నడ ఇండస్ట్రీ మొదటి ప్లేస్ కు రావడానికి కష్టపడతుంది. ఇక కాంతార సినిమా అందులో ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో రిలీజ్ అయ్యి ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో రిషబ్ కు ఎంత పేరు వచ్చిందో లీలగా చేసిన హీరోయిన్ సప్తమి గౌడ కూడా అంతే పేరు సంపాదించుకొంది. ఆమె లుక్, రెండు ముక్కుపుడకలతో సాంప్రదాయకంగా కనిపించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సప్తమి ఒక నిజాన్ని బయటపెట్టింది. ఈ సినిమా కోసం తాను చాలా రిస్క్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
“మొదటి నుంచి నాకు ముక్కుపుడక లేదు. చిన్నప్పటి నుంచి ముక్కు కూడా కుట్టించుకోలేదు. ఈ పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడు రెండు ముక్కుపుడకలు ఉండాలని చెప్పారు. అవి న్యాచురల్ గా ఉండాలని ఒరిజినల్ గా ముక్కు కుట్టించుకున్నాను.. రెండు వైపులా నిజంగానే ముక్కు కుట్టించుకున్నాను” అని చెప్పుకొచ్చింది. సాధారణంగా అయితే హీరోయిన్లు ఇన్స్టాంట్ ముక్కుపుడకలను అతికించుకుంటారు. కానీ ఈ భామ మాత్రం ఒరిజినాలిటీ కోసం ఇంత రిస్క్ తీసుకుంది అంటే సినిమాపై, పాత్రపై తనకున్న నమ్మకానికి హ్యాట్సాఫ్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.