Santosham OTT Awards: రెండోసారి సంతోషం ఓటీటీ అవార్డ్స్.. గెట్ రెడీ అంటున్న సురేష్ కొండేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santosham OTT Awards on November 18th 2023: ఈ సంవత్సరం గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18న హైదరాబాద్ లో సంతోషం ఓటీటి అవార్డ్స్ – డిసెంబర్ 2న గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అందరు హీరోలు అభిమానులకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంతోషం ఓటీటీ అవార్డ్స్ కూడా గత ఏడాది మొట్టమొదటిగా మొదలుపెట్టింది సంతోషం సంస్థనే అని రెండవసారి ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ తారీఖున ఓటీటీ అవార్డ్స్ ని అలాగే డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Chandrababu: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ
Also Read
ఇక ఆ తరువాత పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సంతోషం సంస్థ నుంచి 25 సంవత్సరాలు పాటు అవార్డులు కొనసాగించాలని అనుకున్నానని, ఇప్పటికి 25 సంవత్సరాలు దగ్గరయింది, ఇంకో మూడు సంవత్సరాలు కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాను అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలని అన్నారు. సంతోషం మ్యాగజైన్ మొదలెట్టినప్పుడు నాకు ఇంకా చిన్న వయసు అని నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర నటీనటులందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చానని అన్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున సురేష్ కొండేటి కూడా ఫిలింఫేర్ స్థాయిలో అవార్డ్స్ నిర్వహించగలడు అని నా పై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకున్నానని మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, లాంటి అగ్ర హీరోలు సురేష్ కొండేటి చేయగలడు అని నా పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లు వరకు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఆగకుండా నిర్వహించాననిఅన్నారు.ఇక గోవా గవర్నమెంట్ సహకారం మర్చిపోలేనిదని, ఆ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..