Sanjay Dutt: సౌత్ ఇండస్ట్రీపై సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాలవైపు చూస్తున్న సంగతి తెలిసిందే . ఇక ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేసినవనే చెప్పాలి. ఇక తాజాగా సౌత్ ఇండస్ట్రీపై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ఈ చిత్రంలో సంజయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అధీరా పాత్రలో సంజయ్ లుక్ ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సంజూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
” క్యాన్సర్ తో పోరాడిన తర్వాత ఇలాంటి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలోను ఇటువంటి నేరపూరితమైన పాత్రలను పోషించాను. సెట్ లో అందరూ నన్ను బాగా చూసుకున్నారు. నా హెల్త్ బాలేదని ప్రశాంత్ చిన్న చిన్న సీన్స్ చేయించేవాడు.. కనై, నేను అందుకు ఒప్పుకోలేదు. పాత్రకు ఎలాంటి సీన్స్ అనుకున్నారో అన్ని చేస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఒక నటుడిని.. నా జీవితం చివరి వరకు నేను నటిస్తూనే ఉంటాను. ఇక సౌత్ ఇండస్ట్రీ గురించి అడిగిన ప్రశ్నకు ” కెజిఎఫ్ 2 అనేది పాన్ ఇండియా మూవీ కాదు.. అది హిందుస్తానీ సినిమా.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అంత అద్భుతంగా మలిచాడు. అతనికి ఈ సినిమా ఎలా తీయాలి అనేదానిమీద మంచి పట్టు ఉంది. ఇక యష్ తో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. రవీనా టండన్ అద్భుతంగా నటిస్తుందని” ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!